Diabetes | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అనారోగ్యకరమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాలతో దేశవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అత్యధిక మధుమేహ రోగులున్న రాష్ర్టాల్లో కేరళ మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. పార్లమెంట్లో మధుమేహం వ్యాధి పరిస్థితిపై పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమాధానం ఇచ్చింది. అసంక్రమిత వ్యాధుల(ఎన్సీడీ) సర్వే, ఎన్సీడీ కేంద్రాల ద్వారా చికిత్స పొందుతున్న రోగుల వివరాలతో నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 32.33 కోట్ల మందిపై ఎన్సీడీ మధుమేహ సర్వే చేసినట్టు తెలిపింది. ఇందులో 2.96 కోట్ల మందికి వ్యాధి ఉన్నట్టు తేలిందని అంటే పరీక్షించిన ప్రతీ 11 మందిలో ఒకరికి వ్యాధి నిర్ధారణ అయినట్టు పేర్కొంది. ఎన్సీడీ కేంద్రాల ద్వారా 3.13 కోట్ల మందికి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది.
తెలంగాణలో ప్రతీ ఏడుగురిలో ఒకరికి కేంద్రం నివేదిక ప్రకారం తెలంగాణలో ఈ ఏడాది నవంబర్ వరకు 1.75 కోట్ల మందికి ఎన్సీడీ పరీక్షలు నిర్వహించింది. వీరిలో 24.52 లక్షల మందికి అంటే ప్రతీ ఏడుగురిలో ఒకరికి జబ్బు ఉన్నట్టు నిర్ధారణ అయింది. దేశంలోనే అత్యధిక బాధితులు గల రాష్ర్టాల్లో కేరళ మొదటి స్థానంలో, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణలో మధుమేహ గణాంకాలు
దేశంలో మధుమేహ గణాంకాలు
అత్యధిక మధుమేహ బాధితులున్న రాష్ర్టాలు (బాధితుల సంఖ్య లక్షల్లో)