NTPC | కరీంనగర్ : ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగంలో 2023కు గాను ఎన్టీపీసీ రామగుండానికి గోల్డెన్ పికాక్ అవార్డు లభించింది. ఈ మేరకు గురువారం బెంగుళూరులో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) నుంచి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్‌కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
స్థానిక ఎన్టీపీసీలో దేశంలోనే అతి పెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటును నిర్మించడం, యాదాద్రి తరహా ఫారెస్ట్ ఏర్పాటుతో గ్రీన్ ఎనర్జీ, సీవోటూ ఉద్గారాల తగ్గింపులో ఎన్టీపీసీ ప్రతిభకు గానూ ఐఓడీ ఈ పురస్కారాన్ని అందజేసింది. రామగుండం ఎన్టీపీసీ గత నాలుగేళ్లలో మూడోసారి ఈ అవార్డును అందుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఆపరేషన్ ఏజీఎం అశుతోష్ కుమార్, సీనియర్ మేనేజర్ మునగ వంశీకృష్ణ పాల్గొన్నారు.