హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షలు విరాళంగా సమర్పించారు. శుక్రవారం ఆయన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని గచ్చిబౌలిలోని నివాసంలో కలిసి చెక్కును అందజేశారు. మల్లారెడ్డి గతంలో కరోనాపై పోరులో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి, మిషన్ కాకతీయ పథకానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. సొంత ఊరు నల్లగొండ జిల్లా సుంకిశాలలో కళాశాల, వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించారు.
విరాళాలు జమచేయాల్సిన ఖాతా వివరాలు
ఖాతా నంబర్: 6814884695
ఐఎఫ్ఎస్సీ కోడ్: ఐడీఐబీ000వై011, ఇండియన్‌బ్యాంకు యాదగిరిగుట్ట బ్రాంచ్
ఖాతాపేరు : Executive office SLNSD