హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న దీక్షా దివస్ను నిర్వహించనున్నట్టు ఎన్నారై గ్లోబల్సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009న నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు.
యావత్తు సమాజం కేసీఆర్ వెంట నిలవడంతోనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా దీక్షాదీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను స్మరించుకొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు దీక్షా దివస్ను నిర్వహించుకోవాలని మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.