మంత్రి కేటీఆర్‌కు 11 లక్షల చెక్కు అందజేత
దంతాలపల్లి, మార్చి 29: మన ఊరి బడిని మనమే బాగుచేసుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు- మన బడి ’కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు సైతం భాగస్వాములవుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి దాతలు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఎన్నారై రామగిరి వెంకట్ ఉద్యోగరీత్యా అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఆయన గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో పూర్వ విద్యార్థి. న్యూజెర్సీ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన వెంకట్.. తాను చదువుకొన్న పాఠశాల అభివృద్ధికి రూ.11 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెంకట్‌ను అభినందించారు.