హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును సొంతపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మరిచిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తుంచుకోలేని దుస్థితి. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మరచిపోయారు. జలసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి’ అని ప్రసంగించారు.
దీనిపై సోషల్‌మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగర్, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను ఉచ్ఛరించారు. అయితే హంద్రీనీవా కూడా తెలంగాణ ప్రాజెక్టేనంటూ రేవంత్‌రెడ్డి వివరించడం ఇంజినీర్లను విస్మయానికి గురిచేసింది. ఏపీ ప్రాజెక్టులేవో, తెలంగాణ ప్రాజెక్టులేవో తెలియదా అంటూ ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు.