Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పని చేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.