హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జాబ్ క్యా లెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, అనిల్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యు లు టీ జీవన్‌రెడ్డి, బల్మూర్ వెంక ట్ తదితరులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని దశలవారీగా భర్తీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా, రేవంత్ రెడ్డి సరారు గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖాళీల వివరాల్లేని.. నోటిఫికేషన్, పరీక్షల తేదీల్లేని జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఉసూరుమనిపించిందని విపక్ష సభ్యులు విమర్శించారు.