హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలని పిటిషన్ దాఖలు చేసిన రాములుకు పలుసార్లు ఫోన్ చేసిన కానిస్టేబుల్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మంగళవారం జరిగే విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మహేశ్వరం పీఎస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు బెదిరించారని రాములు తరఫు న్యాయవాది వేసిన పిటిషన్ హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది.