సిద్దిపేట, మే 24: సిద్దిపేటలో హరితహారం చె ట్లను నరికినందుకు వి ద్యుత్శాఖకు రూ.24 లక్షలు జరిమానా చెల్లించాలని శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి నోటీసులు జారీచేశారు. ఈ నె ల 19, 22న సిద్దిపేటలో ని రాజీవ్ రహదారి, మెదక్రోడ్, ఎన్సాన్పల్లిరోడ్, సిరిసిల్ల బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ వారు 400 చె ట్లు నరికి వేశారు. వాల్టా చట్టం 2002 లోని సెక్షన్ 35 (చాప్టర్-6)లోని సబ్ సెక్షన్ 3 కింద రూ.24 లక్షలు పరిహారంగా చెల్లించాలని, ఆ చెట్ల స్థానంలో 400 కొత్త చెట్లను నాటడానికి విద్యుత్ శాఖ బాధ్యత తీసుకోవాలని నోటీసులో కమిషనర్ పేర్కొన్నారు. హరితహారం చెట్ల నరికివేతపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలను చూసి మున్సిపల్ కమిషనర్ స్పందించారు.