హైదరాబాద్ జూన్ 5 (నమస్తేతెలంగాణ)/బండ్లగూడ: కాంగ్రెస్ నేత లు చేసిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులు నోటీసులు అందజేశారు. మిస్ ఇంగ్లండ్ పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించారంటూ పత్రిక ల్లో పబ్లిష్ అయిన క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయంలో కాం గ్రెస్ నాయకుడు ఫహీమ్ ఖురేషీ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం క్రిశాంక్‌కు నో టీసులు ఇచ్చి, శనివారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. ఇది.. కాంగ్రెస్ ప్ర భుత్వం తనపై నమోదు చేసిన 23వ కేసు అని, విచారణకు సహకరిస్తానని క్రిశాంక్ స్పష్టంచేశారు.
ఫహీమ్ ఖురేషీ వ్యవహారంలో నాపై కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. నేను ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పో స్ట్ చేశాను. ట్వీట్లో గానీ, ఆ పత్రిక కథనంలో గానీ ఎక్కడా ఫహీం ఖురేషీ పేరు ప్రస్తావనలేదు. కానీ గుమ్మడికా య దొంగ ఎవరంటే భుజాలు తుడుముకున్న చందంగా ఫహీంఖురేషీ అనుచరుల ఫిర్యాదు మేరకు నాపై మే 31న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంటే మిస్‌వరల్డ్ పోటీల నేపథ్యంలో వచ్చిన ఆరోపణలను ఆయన ఒప్పుకున్నట్టేనని భావించాల్సి వస్తున్నది.