హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): భూ భారతి పథకంపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా శాసనసభా గౌరవాన్ని కించపరచిందని బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపకుండానే చట్టంగా ఆమోదం పొందినట్టు డిసెంబర్ 19 (గురువారం)న అన్ని పత్రికల్లో ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసిందని పేర్కొన్నది. సభా సంప్రదయాలనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభుత్వం అవమానించిందని శుక్రవారం స్పీకర్‌కు ఇచ్చిన సభాహక్కుల నోటీస్‌లో స్పష్టంచేసింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాగంటి గోపీనాథ్, విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
భూ భారతి బిల్లుకు ఆమోదం
హైదరాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన భూభారతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును ఆమోదించినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభలో వెల్లడించారు. భూభారతి బిల్లుపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. చర్చ ముగిసిన అనంతరం బిల్లును ఆమోదించాల్సిందిగా సభను కోరారు. అనంతరం ఓటింగ్ నిర్వహించిన స్పీకర్.. బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. భూముల వివరాలను సురక్షితంగా ఉం చడంతోపాటు పారదర్శకతను తెచ్చేందుకే భూభారతి బిల్లును ప్రవేశపెట్టినట్టు సభలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 1.52 కోట్ల ఎకరాల భూము ల వివరాలను భద్రపరిచేందుకు, యజమానుల హక్కులను కాపాడేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. ధరణిలో అనేక లోపాలున్నట్టు గుర్తించినందునే కొత్త విధానాన్ని తెచ్చామని తెలిపారు. తాజాగా భూముల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఐసీకి అప్పగించామన్నారు. మరోవైపు ధరణి పోర్టల్ అంశాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.