NOTA | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో నోటా నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం పోలైన ఓట్లలో 924 మంది నోటాకు ఓటేశారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణకు ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)ను ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు ఉంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. ఐతే పోటీలో ఉన్న వాళ్లెవరికి నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్ను ఈవీఎంలలో నోటా రూపంలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. ఇలా 924 మంది నోటా వైపు మొగ్గు చూపడం పట్ల చర్చనీయాంశంగా మారింది.