Mahesh Kumar Goud | హైదరాబాద్ ,మార్చి 13 (నమస్తే తెలంగాణ): ‘అధికారులపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. రాష్ట్రంలో ఎమ్మార్వో నుంచి ఐఏఎస్ దాకా సక్రమంగా పనిచేయడం లేదు.. అలసత్వం ప్రదర్శిస్తున్నారు.. వారి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్న’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు టీ మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులైనా, అధికారులైనా ప్రజలిచ్చే డబ్బులతో పనిచేస్తున్నామనే విషయం మరువరాదు.. వారి వైఖరితో సర్కారుకు చెడ్డపేరు వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. అధికారులు పనితీరు మార్చుకోకుంటే ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని హూంకరించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలోనే ఈ విధంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. కాగా, పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆడలేక మద్దెలు ఓడు చందంగా ఆయన వ్యాఖ్యలున్నాయని ఆగ్రహించారు. ఆయన ఏ హోదాలో ఈ విధంగా మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్,మార్చి 13 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఆయన మీ డియాతో మాట్లాడారు. తనకు మంత్రి పద వి వస్తుందని ఎన్నడూ చెప్పలేదని స్పష్టంచేశారు. భువనగిరి ఎంపీ స్థానం కోసం తాను నిద్రాహారాలు మాని పార్టీ అభ్యర్థిని గెలిపించానని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తే అది పార్టీకి, ప్రజలకే లాభమని తెలిపారు. మంత్రి పదవి ఆశించి తాను ఏ పనులూ చేయనని పేర్కొన్నారు.