చండూరు, అక్టోబర్ 3: రెండో విడత విస్తరణలో మంత్రి పదవిని ఆశించి భంగపడినవారిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఆశలు అడియాశలు కాగా, ప్ర స్తుతం ఆయన సీఎం రేవంత్‌పై గుర్రు గా ఉన్నారు. మంత్రి అవుదామనుకున్న రాజగోపాల్‌రెడ్డి ఆశ అలాగే ఉన్నా, అభిమానులు మాత్రం ఏకం గా మంత్రిని చేసేశారు. ఇదే ఇప్పుడు చండూరు నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్డు డివైడర్ వెంట ఉన్న విద్యుత్ స్తంభాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫొటోలతో కూడి న జెండాలు ఏర్పాటు చేశారు. వాటి లో రాజగోపాల్ ఫొటోతోపాటు మం త్రి రాజన్న(కేఆర్‌జీఆర్)ఆర్మీ అంటూ ప్రచురించారు.
సూర్యాపేట, అక్టోబర్ 3: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి బుధవారం రాత్రి మృతిచెందగా శుక్రవారం నా యకులు, ప్రజల సందర్శనార్ధం సూర్యాపేటకు తీసుకొచ్చి రెడ్హౌజ్ లో ఉంచారు. దామన్న భౌతికకాయానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్‌హౌజ్‌లో భౌతికకాయానికి మంత్రి సీతక్క, ఎంపీ రఘువీరారెడ్డి, డిప్యూటీ స్పీకర్ రాంచందర్‌నాయక్, సీనియర్ నాయకులు జానారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.