హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): తిరుమలలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వానలకుతోడు చలితీవ్రత పెరగడంతో గజగజ వణుకుతున్నారు. శని, ఆదివారాలు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది.
2 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరారు. సర్వ దర్శనానికి 30 నుంచి 40 గంటలు పడుతున్నది.