Telangana | రాష్ట్రంలో 15 మంది నాన్ కేడర్ ఎస్పీల బదిలీ..!
Trancefers | తెలంగాణలో 15 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రవిగుప్త సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Trancefers | తెలంగాణలో 15 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రవిగుప్త సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల పెద్ద ఎత్తున అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డీఎస్పీలను, అడిషనల్ ఎస్పీలను, నాన్ క్యాడర్ ఎస్పీలను, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో బదిలీ జరిగినట్లు సమాచారం. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా పీ రవీందర్‌ను నియమించారు. సైబరాబాద్ ఎస్బీ డీసీపీగా అశోక్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా కే ప్రసాద్, సైబరాబాద్ ఎస్ఓవీ డీసీపీగా అబ్దుల్ రషీద్, టీఎన్ఏబీ ఎస్పీ అడ్మిన్‌గా వై సాయిశేఖర్, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా ఉషారాణి, రాచకొండ క్రైమ్ డీసీపీగా వీ అరవింద్‌బాబు, ట్రాఫిక్ డీసీపీగా వీ శ్రీనివాసులు నియామకయ్యారు.
బదిలీ ఉత్తర్వులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

