పెబ్బేరు, డిసెంబర్ 19 : యాసంగి పంటలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని జూరాల 3వ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భావన భాస్కర్ శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లోని ఆయకట్టు రైతులు వచ్చే సీజన్లో పంటలు సాగు చేసుకోవద్దని సూచించారు.
జూరాల డ్యామ్‌లో తగినంత నీటి నిల్వలు లేనందున.. ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకొనేందుకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రైతులు యాసంగి పంటలు సాగు చేసుకోకుండా ముందస్తుగా గ్రామాల్లో టాంటాం వేయించాలని తహసీల్దార్లకు సూచించారు.