ఫొటో: పీ సైదిరెడ్డి, సూర్యాపేట : 38 గుంటల భూమిలో ఆరుచోట్ల బోర్లేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమే నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండాలో పంటలు పుష్కలంగా పండాయి. భూక్యా రవీంద్రనాయక్ కూరగాయలు సాగు చేసి లాభాలు గడించాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది. నీళ్లందక పంటలు ఎండుతున్నాయి. ఈ దశలో రవీంద్రనాయక్ ఆరు బోర్లేశాడు. చుక్కనీరు పడలేదు.. కానీ, 3 లక్షల అప్పు తేలింది!