Amaragiri | కొల్లాపూర్ : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజవర్గంలోని పర్యాటక గ్రామమైన అమరగిరికి వెళ్లేదారి బురదమయంగా కావడంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనే గుంతల మయంగా ఉన్న అమరగిరి రహదారి గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది.
అమరగిరి అందాలను వీక్షించేందుకు మంగళవారం ఉదయం పలువురు పర్యాటకులు అటువైపు బయల్దేరారు. బురదమయంగా ఉన్న రోడ్డును చూసి అమరగిరి అందాలను చూడకుండానే వెనక్కి తిరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. అత్యవసర సమయాలలో కొల్లాపూర్‌కు రావాలంటే ఎనిమిది కిలోమీటర్ల దూరానికి గంట ప్రయాణం చేయాల్సి వస్తుందని, అంతేకాకుండా ప్రమాదాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు.
నల్లమల్ల అడవుల మధ్యలో కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరగిరి అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రోడ్డు మొత్తం బురదమయం కావడంతో పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమరిగిరి అందాలు బాగున్నాయి కానీ అమరిగిరికి వెళ్లే దారి బాగాలేదని పర్యాటకులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమరిగిరిపై దృష్టి పెట్టి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి ఇలాకాలో ప్రభుత్వ స్థలాలు కబ్జా
Sangareddy | ప్రాణాలు పోయినా పర్వలేదు.. ఫార్మాసిటీకి భూములు ఇవ్వం
Ravi Shastri | వరల్డ్ కప్ కాదు.. ఆ విజయాలే 24 క్యారెట్ల బంగారంతో సమానం