హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : పోస్టులున్నా..పదోన్నతులు పొందలేని పరిస్థితి విద్యుత్తు సంస్థల్లో నెలకొంది. ఇంజినీర్లు, ఉద్యోగులు ప్రమోషన్ లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మూడు సీజీఎం పోస్టులు ఏడేండ్లుగా ఖాళీగా ఉన్నాయి.
దీంట్లో రెండు టెక్నికల్, ఒక అకౌంట్స్ పోస్టు ఉన్నాయి. ఐదు సూపరింటెండెంట్ పోస్టులు (ఎస్ఈ),13 డివిజినల్ ఇంజినీర్, 28 అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్, 40 వరకు ఏవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఇన్చార్జిలను నియమించి కాలం వెల్లదీస్తున్నారు. కోర్టుకేసు తేలినరోజు రివర్షన్ ఇస్తామన్న షరతుతోనైనా పదోన్నతులివ్వాలని ఇంజినీర్లు కోరుతున్నారు.