గ్రామీణాభివృద్ధి అయినా.. పట్టణాభివృద్ధి అయినా సీఎం కేసీఆర్ సమ్మిళితవృద్ధి మోడల్స్‌కు ఎవరూ సాటిరారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణకు 19 అవార్డులు దక్కడంపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. జాతీయ అవార్డు అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌కు, మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ట్వీట్ చేశారు.
తెలంగాణలోని నాలుగు మండలాలు, 14 గ్రామాలు, ఒక జిల్లా పరిషత్‌కు నాలుగు కేటగిరీల్లో మొత్తం 19 అవార్డులు వచ్చాయని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మరే రాష్ట్రం సాటిలేదని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. డిపార్ట్మెంట్కు మార్గనిర్దేశం చేసిన సీఎం కేసీఆర్సార్కు టన్నుల కొద్దీ ధన్యవాదాలు తెలుపుతున్నాన్నారు. అద్భుతంగా పని చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ’19 అవార్డులు గెలుచుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు . సిరిసిల్ల జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.