Insurance | వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోతే… నో పెట్రోల్, డీజిల్!
వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు. ఫాస్టాగ్ కోసం కూడా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. లైసెన్స్ సర్టిఫికెట్లు పొందాలంటే కూడా బీమా తప్పనిసరి.
- అన్ని వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి
- లేకపోతే నో పెట్రోల్, డీజిల్, ఫాస్టాగ్!
- త్వరలో అమల్లోకి కేంద్రం నిబంధనలు
- అవగాహన లేకపోతే నష్టపోవాల్సిందే!
- ప్రజలకు రవాణాశాఖ అధికారుల హెచ్చరిక
Insurance | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు. ఫాస్టాగ్ కోసం కూడా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. లైసెన్స్ సర్టిఫికెట్లు పొందాలంటే కూడా బీమా తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా ఉంటే జరిగిన నష్టానికి పరిహారం పొందే వీలు కలుగుతుంది. ఇన్సూరెన్స్‌తో ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చని అధికారులు చెప్తున్నారు. లేకపోతే చాలా నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
చట్టం ఏం చెప్తున్నది?
మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్పనిసరిగా థర్డ్‌పార్టీ బీమా పాలసీ ఉండాలి. కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏ) 2024లో దేశంలో 40 కోట్ల వాహనాలు ఉన్నాయని అంచనా వేస్తే అందులో దాదాపు 50 శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉందని తెలుస్తున్నది. కొత్త నిబంధనల ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.2,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రెండోసారి పట్టుబడితే రూ.4,000 వరకు జరిమానా ఉంటుంది.
సర్వీస్ రూల్స్‌లో మార్పులు
వాహన సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసే ప్రతిపాదనలను కూడా కేంద్ర రవాణామంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. వాహన సేవలను బీమా కవరేజీతో లింక్ చేసే అవకాశాలున్నాయి. ఈ కొత్త నిబంధనలను కచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు రవాణాశాఖ వర్గాలు చెప్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

