హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్నామని పేర్కొన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్‌కు చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తైందని తెలిపారు. రెండో డోసుల వ్యాక్సినేషన్ 64 శాతం పూర్తైందన్నారు. బూస్టర్ డోస్ కోసం కేంద్రాన్ని కోరామని మంత్రి స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా 21 లక్షల ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో 25,390 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్‌ను ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Road accident : బర్రెను తప్పించబోయి కిందపడ్డ బైక్..ఇద్దరు చిన్నారులు మృతి
మందుపాతర పేలి గ్రే హౌండ్స్ ఆర్ఎస్కి తీవ్ర గాయాలు
Ileana D’Cruz | ఇలియానా అందాల అరబోత..