భద్రాద్రి కొత్తగూడెం : పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి గ్రే హౌండ్స్ ఆర్ఎస్కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చర్ల మండలం సరిహద్దు ప్రాంతం బత్తినపల్లి, యర్రంపాడు మార్గమధ్యంలో చోటు చేసుకుంది. క్షతగాత్రుడిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.