Telangana | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ప్రహసనంగా మారిం ది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని, బహిరంగంగా సభల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నది.
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవి ఇప్పుడు రాజకీయ విమర్శల పాలవుతున్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ కా ర్యాలయం తీసుకుంటున్న నిర్ణయాలను చూ స్తుంటే చట్టం కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలో కండువాలు కప్పుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా, పత్రికల్లో దేశమంతా చూసింది. అయితే, వీరు పార్టీ మారినట్టుగా ‘ఎలాంటి ఆధారాలు లేవు’ అని స్పీక ర్ తీర్పు ఇవ్వడం చర్చనీయమైంది. సాంకేతికంగా వారు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారన డం కండ్లకు గంతలు కట్టుకొని లోకాన్ని మో సం చేయడమేనని విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పది మం ది ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచ లం), బండ్ల కృష్ణామోహన్‌రెడ్డి (గద్వాల), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కాలె యాదయ్య (చేవెళ్ల), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), దానం నాగేందర్(ఖైరతాబాద్), డాక్టర్ సంజయ్ (జగిత్యాల)పై విచారణ జరిపి అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. పార్టీ మారినట్టు నిరూపించే ఆధారాలు సమర్పించింది.
స్పీకర్ విచారణ జరుపకుండా నెలల తరబడి సాగదీత ధోరణిని అవలంబించారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆగ్రహం వ్యక్తంచేసిన కోర్టు మూడు నెలల్లోగా తేల్చాలని జూలై 31న స్పీకర్‌ను ఆదేశించింది. గడువు ముగిసినా అనర్హత అంశంపై తేల్చకపోవడంతో ధర్మాసనం సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణామోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ కి వ్యతిరేకంగా పార్టీ మారారని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు లేవని అనర్హత వే టుకు నిరాకరించారు. అనర్హత పిటిషన్లపై ట్రి బ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న స్పీకర్ పిటిషన్లను తోసిపుచ్చినట్టు గత నెల 17న శాసనసభ కార్యదర్శి ఒక ప్రకటనలో వెల్లడించారు. తాజాగా గురువారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు యాదయ్య, పోచారం కూడా పార్టీ మారలేదని, ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని, వేటువేయలేమని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణ జరగడానికి సరిగ్గా ఒకరోజు ముం దే స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించడం అనుమానాలకు తావిస్తున్నది. కోర్టు ఆదేశాల నుం చి తప్పించుకోవడానికే గతంలో ఐదుగురు, తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఫి ర్యాదులను డిస్మిస్ చేసినట్టు స్పష్టమవుతున్నది. స్పీకర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఫిరాయింపుదారులను కాపాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమనే అభిప్రా యం వ్యక్తమవుతున్నది. ప్రజాస్వామ్య దేవాలయం వంటి అసెంబ్లీలో కూర్చొని, రాజ్యాంగాన్ని తుంగలో తొకేలా నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్ రాజకీయాలకు గొడ్డలి పెట్టు గా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు.
ఇప్పటివరకు స్పీకర్ ఏడుగురికి క్లీన్ చీట్ ఇవ్వగా మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్. వీరిలో కడియం, సంజయ్ బీఆర్ఎస్లోనే ఉన్నామని పేర్కొన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసి కూడా ఇప్పటివరకు స్పీకర్ నోటీసుపై స్పందించలేదు. శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మరోసారి స్పీకర్ తాత్సారంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ కేసులో రెండువారాల్లో జరిగిన పురోగతిని పరిశీలించి తర్వాత ఉత్తర్వులు ఇస్తామని స్ప ష్టంచేసింది. ఈ నేపథ్యంలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణ యం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.