ఆర్టీసీలో ఎన్నికలొద్దు.. విలీనమే ముద్దు!
తెలంగాణ ఆర్టీసీలో ప్రభుత్వం పెట్టిన చిచ్చు చల్లారడం లేదు. ఆర్టీసీ సమ్మె చర్చల్లోనూ, ముఖ్యమంత్రితో మీటింగ్‌లోనూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టినా.. ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తూనే ఉన్నది. కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తిని మరింత రగిలిస్తూ.. ఆర్టీసీ విలీన అంశాన్ని పక్కనపెట్టి గుర్తింపు సంఘం ఎన్నికలను భుజానికి ఎత్తుకున్నది.
- మొదటి నుంచి సర్కార్‌ను కోరుతున్న కార్మికులు
- ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వం మొండివైఖరి
- విలీనం మరింత ఆలస్యమయ్యే ప్రమాదం
- మరో పోరాటం తప్పదని హెచ్చరిక
- దోబూచులాడుతున్న కొన్ని కార్మిక సంఘాలు
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో ప్రభుత్వం పెట్టిన చిచ్చు చల్లారడం లేదు. ఆర్టీసీ సమ్మె చర్చల్లోనూ, ముఖ్యమంత్రితో మీటింగ్‌లోనూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టినా.. ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తూనే ఉన్నది. కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తిని మరింత రగిలిస్తూ.. ఆర్టీసీ విలీన అంశాన్ని పక్కనపెట్టి గుర్తింపు సంఘం ఎన్నికలను భుజానికి ఎత్తుకున్నది. దీంతో విలీన ప్రక్రియపై తమకు రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇప్పటికిప్పుడు సమ్మెకు పిలుపునిచ్చినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు.
కార్మిక సంఘాల నేతలు పిలుపునిస్తే విలీనం కోసం జరిగే మలిదశ పోరాటంలో ముందుండి ప్రభుత్వంతో కొట్లాడుతామని అంటున్నారు. కాగా, తమకు గుర్తింపు సంఘం ఎన్నికలు వద్దంటూ.. విలీనమే చేపట్టాలంటూ ఇప్పటికే నిరసనలతో కొన్ని కార్మిక సంఘాలు హోరెత్తించాయి. నిరవధిక నిరసన దీక్షలు, డిమాండ్స్డేలు, డిపోల ఎదుట నిరసనలు చేపట్టి తమ ఆకాంక్షను తెలిపాయి. అయినా ప్రభుత్వం మొండివైఖరితో గుర్తింపు సంఘం ఎన్నికలకు మొగ్గు చూపుతున్నదని మండిపడుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల కారణంగా విలీన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని కొందరు కార్మిక నేతలు అంటున్నారు.
ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసి, ఇప్పటికే ఉన్న సంఘాలలో ఒకరొకరు చొప్పున విలీన కమిటీలో వేసి, తుది నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. కొన్ని యూనియన్లకు చెందిన అగ్రనాయకుల కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చిందని కార్మికులు అంటున్నారు. కొందరు నాయకులు వాళ్ల స్వార్థంతో వేలాదిమంది కార్మికుల పొట్ట కొడుతున్నారని , యాజమాన్యంతో కుమ్మక్కై బయటొకటి, లోపల ఒకటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారివల్లే కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని వాపోతున్నారు. కొన్ని యూనియన్ల నాయకుల కుట్రలను కార్మికులు పసిగట్టి తరిమికొట్టాల్సిన అవసరం వచ్చిందని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై చర్చించిన తర్వాతే..
ఆర్టీసీలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన విషయమై తాము త్వరలోనే సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. ఎన్నికలు నిర్వహించే అంశంపై తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని చెప్పారు. ప్రభుత్వం పంపే ఉత్తర్వులనుబట్టే తమ ఆలోచన ఉంటుందని చెప్పారు. రిటర్నింగ్ అధికారిని నియమించారనే విషయంపై మాట్లాడుతూ.. కార్మిక సంఘాలకు లేబర్ కమిషన్ నుంచి లేఖలు వస్తేనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనదని భావిస్తామన్నారు. అయితే, తమ మొదటి ప్రాధాన్యం మాత్రం ఆర్టీసీ విలీనానికే ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని సంఘాల నాయకులతో ‘నమస్తే’ మాట్లాడగా.. జేఏసీ తీసుకునే నిర్ణయం ఆధారంగానే తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. మరికొన్ని సంఘాల నాయకులు ఇప్పటికిప్పుడు ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి తక్షణ విలీన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

