హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక భద్రతను కాపాడటంలో పూర్తిగా విఫలమైన జా తీయ నిఘా సంస్థలు.. కేంద్ర ప్రభు త్వ తప్పులను ఎత్తిచూపుతున్న రాజకీయ పార్టీలు, విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా విచారణ చేపడుతున్నాయని తెలంగాణ రైతు రక్షణ స మితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విమర్శించారు. ఆర్థిక దోపిడీకి పాల్పడి దేశం వదిలి స్వేచ్ఛగా విదేశాలకు పారిపోతుంటే ఆ సంస్థలు నియంత్రించలేకపోతున్నాయని మండిపడ్డారు.
ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు చెందాల్సిన లక్షల కోట్ల ప్రజల సొమ్మును బ్యాంకు అధికారులు, రాజకీయ నేతల అం డతో ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వకుండా అప్పుగా ఇస్తున్నారని చెప్పారు. బ్యాంకు రుణాలు తీసుకున్న బడాబాబులు వాటిని చెల్లించకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు.