డంపింగ్ యార్డు వద్దు.. ఆ ప్రతిపాదనను రద్దు చేయాలి : ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డిమాండ్
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- మా నియోజకవర్గ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
- పెండింగ్ బిల్లులు ఇవ్వాలి
- సీఎస్ రామకృష్ణారావుకు వినతిపత్రం సమర్పణ
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుకు వినతిపత్రం అందచేశారు.
సిరిసపల్లి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల హుజూరాబాద్, చుట్టుపక్క ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోతాయని, అక్కడి పంట పొలాలు, నీటి వనరులు, వాతావరణం తీవ్రంగా ప్రభావితమై స్థానికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విత్తనోత్పత్తికి అనుకూలమైన సమశీతోష్ణ వాతావరణం కలిగిన హుజూరాబాద్ ప్రాంతాన్ని ‘వేస్ట్ టు ఎనర్జీ’ పేరుతో కాలుష్య కేంద్రంగా మార్చడం అన్యాయమని పేర్కొంటూ.. డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మానకొండూరు నియోజకవర్గంలోని కల్వల గ్రామంలో నిర్మించాల్సిన సాగునీటి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ నియోజకవర్గంలోని 6 వేల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని వివరించారు. తన నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని కౌశిక్‌రెడ్డి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

