నడకదారి భక్తులకు ఊతకర్ర
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
- 12 ఏండ్లలోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి
- గుంపులుగా భక్తులు.. రక్షణగా గార్డులు
- దివ్యదర్శనం టోకెన్ల భక్తులకు రోడ్డు మార్గంలోనూ అనుమతి : టీటీడీ చైర్మన్
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో యాత్రికుల భద్రతపై సోమవారం సాయంత్రం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో టీటీడీ ఈవో, ఎస్పీ, అటవీశాఖ, జేసీ, ఇతర అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏండ్లలోపు వారిని తల్లిదండ్రులతో అనుమతిస్తామని పేర్కొన్నారు.
పెద్దలను మాత్రం రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు. నడకదారి భక్తులకు ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు. ఘాట్‌రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామన్నారు. భక్తులను గుంపులుగా పంపుతామని, వీరికి సెక్యూరిటీ గార్డులు భద్రతగా ఉంటారని తెలిపారు. నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశామని, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగిస్తామని వివరించారు. దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లవచ్చని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా 30 అడుగుల దూరం కనిపించేలా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మెట్ల మార్గంలో కంచె ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు అటవీశాఖకు ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

