ఖాదీ వస్ర్తాలు వినియోగించండి
గ్రామీణ ప్రాంతాల్లోని నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు అన్ని వైద్య కళాశాలలు, దవాఖానల యాజమాన్యాలు, డాక్టర్లు ఖాదీ వస్ర్తాలు వినియోగించాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించింది.
- మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు, డాక్టర్లకు ఎన్ఎంసీ విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు అన్ని వైద్య కళాశాలలు, దవాఖానల యాజమాన్యాలు, డాక్టర్లు ఖాదీ వస్ర్తాలు వినియోగించాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కుటీర పరిశ్రమలపై ఆధారపడిన లక్షలాది మందిని ఆదుకునేలా వాటి ఉత్పత్తులను వాడాలని కోరింది. వైద్య సిబ్బంది కోసం, దవాఖానల్లో వినియోగం కోసం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ప్రత్యేకంగా వస్ర్తాలు తయారు చేస్తున్నదని తెలిపింది.
డాక్టర్ల కోసం తెల్లకోటు, వైద్యసిబ్బంది కోసం ఆప్రన్లు, హాస్పిటళ్లలో వాడేందుకు బెడ్ షీట్లు, పిల్లోకవర్లు, కర్టెన్లు, పేషెంట్ల గౌన్లు, గ్రామాల్లో తయారుచేసే సబ్బులు, హ్యాండ్ వాష్, ఫినాయిల్ వంటివాటిని వినియోగించవచ్చని సూచించింది. ఖాదీ వస్ర్తాలు శరీరానికి చాలా మంచివని, పూర్తి పర్యావరణ హితమైనవని పేర్కొన్నది. ముఖ్యంగా డాక్టర్లు ఖాదీ కోటును ధరించాలని విజ్ఞప్తి చేసింది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని, గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో తోడ్పడాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

