హైదరాబాద్, డిసెంబర్7 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా బాలొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌కు 5 బెడ్లతో కూడిన డయాలిసిస్ సెంటర్ మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ డయాలిసిస్ సెంటర్ నియోజకవర్గంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేదలకు ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు.