ఖలీల్‌వాడి (మోపాల్), నవంబర్ 25: చిన్నారితో కలిసి ఓ తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏదీ సాధించలేక పోతున్నా. నాకు చావే శరణ్యం. నువ్వు రెండో పెండ్లి చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్‌నోట్ రాశాడు. నిజామాబాద్ సీతారాంనగర్ కాలనీకి చెందిన క్రాంతికుమార్ (35)కి భార్య మానస, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ధర్మారం (బీ) గురుకుల పాఠశాలలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 18 నెలల కూతురుకు చిన్నప్పటి నుంచి మెదడు ఎదుగుదల సరిగా లేకపోవడంతో పాపను దవాఖానల చుట్టూ తిప్పి అప్పుల పాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు, పాప ఆరోగ్య పరిస్థితి క్రాంతిని మానసిక వేదనకు గురిచేశాయి. సోమవారం తెల్లవారుజామున చిన్నారితోపాటు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను వెలికి తీయించారు. క్రాంతి రాసిన సూసైడ్ స్వాధీనం చేసుకున్నారు.