ముంబై, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): మరాఠాలకు నిజాం కాలంనాటి రిజర్వేషన్లు కల్పించాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ ఉత్తర ముంబై లోక్సభ సమన్వయకర్త రవీంద్ర రోకడే డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ముంబై కొంకణ విభాగం ఆధ్వర్యంలో వివిధ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాంద్రా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రోకడే మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వాలు తమవారికి కాం ట్రాక్టులు అప్పగిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ ముంబై సబర్బన్ జిల్లా సమన్వయ కర్త సంజయ్ నింబాల్కర్, బాంద్రా తూర్పు సమన్వయకర్త సందీప్ కొమురెల్లి, బాం ద్రా పశ్చిమ సమన్వయకర్త సాగర్ పవార్, గౌరవ్ వరమ్ పాల్గొన్నారు.