దస్తురాబాద్, మే 2 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెం శివారులో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. వన్యప్రాణుల వేట కోసం గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన నాటుబంబును మేతకు వెళ్లిన బర్రెలు కొరకడంతో అవి పేలి నోటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
కొంతకాలంగా ఇక్కడ అడవి పందులు, జింకల వేట సాగుతున్నట్టు స్థానికులు తెలిపారు. వెటర్నరీ అసిస్టెంట్ దేవీదాసు గాయపడిన బర్రెను పరిశీలించారు. ఖానాపూర్ సీఐ అజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.