వనపర్తి : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతో సంస్థాగత నిర్మాణం పటిష్టం చేపట్టాలి నాయకులు, కార్యకర్తలు పార్టీకి అంకితమై సభ్యత్వ నమోదు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం వనపర్తి జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మన వనపర్తిలో 70వేల 500 సభ్యత్వం జరిగింది. సాకులు చెప్పి సభ్యత్వ నమోదులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. పార్టీ పట్ల విధేయత, చిత్తశుద్ధి, అంకితభావం ఉన్న కార్యకర్తలకు పార్టీ పదవులలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పట్ల స్పందించే నాయకులు నిత్యం ప్రజలలో ఉండే నాయకులే పార్టీ పదవులు వస్తాయని పేర్కొన్నారు. దుష్ప్రచారం వల్ల గత ఎన్నికలో ఓడిపోయాం. కార్యకర్తల శిక్షణనే పార్టీకి శ్రీరామరక్ష.
తెలంగాణ సోయి లేనివాళ్లు నీటి పాలకులుగా ఉండడం దురదృష్టకరమన్నారు. హామీలు విస్మరించిన నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.