కరీంనగర్ : జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వాగులో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 9 మంది ఇటుక బట్టి కార్మికులు సురక్షింతంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీం క్షేమంగా ఒడ్డుకు చేర్చింది.
కాగా, విషయం తెలిసిన వెంటనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను అప్రమత్తం చేశారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తమ ప్రాణాలను కాపాడిన మంత్రి గంగులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట మేయర్ వై సునీల్ రావు, సీపీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.