నిజామాబాద్ : నాలుగో సారి ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్‌కు జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ ఎంపికయ్యారు. మే 6 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్‌కు ఇస్తాంబుల్ బయలుదేరిన 12 మంది ఇండియన్ బాక్సర్ల లో నిఖత్ జరీన్ ఒకరు.
కాగా, 2011- టర్కీ, 2013 – బల్గేరియా, 2016 – కజకిస్తాన్‌లో ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. 2022 – ఇస్తాంబుల్ లో జరిగే ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ పోటీ పడునున్నది.