సిద్దిపేట : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే అంతిమ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అనాథలు, అభాగ్యులు రోడ్లపై తిరుగుతూ జీవనం సాగిస్తున్న వారి కోసం ప్రభుత్వం రాత్రి బస కేంద్రం (నైట్షెల్టర్)ను ఏర్పాటు చేసిందన్నారు.
ఈ కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు నిర్వాహకులకు సూచించారు.
జిల్లా కేంద్రంలోని మణికంఠ నగర్లో మెప్మా-డీఏవై-ఎన్ యూఎల్ఏం- ఆధ్వర్యంలో రూ.72.82 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అందుకే సమాజంలోని ఏ ఒక్క పేదలూ ఆకలితో అలమటించకూడదని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నైట్ షెల్టర్ లో అనాథలకు ప్రతిరోజు ఉచితంగా టిఫిన్, భోజనం, బెడ్, లాకర్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
అలాగే తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వినోదం, పచ్చదనం-పరిశుభ్రత వంటి మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు తీసుకున్నట్లు, ఈ కేంద్రంలో సేద తీరుతున్న పేదల పట్ల సామాజిక సృహతో వ్యవహరించాలని నిర్వాహకులను మంత్రి కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, స్థానిక కౌన్సిలర్ అక్తర్ పటేల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఈఈ వీర ప్రతాప్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Road accident : బర్రెను తప్పించబోయి కిందపడ్డ బైక్..ఇద్దరు చిన్నారులు మృతి
మందుపాతర పేలి గ్రే హౌండ్స్ ఆర్ఎస్కి తీవ్ర గాయాలు
Ileana D’Cruz | ఇలియానా అందాల అరబోత..