హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): పాక్ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం తనిఖీలు చేపట్టింది. తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ర్టాల్లో మొత్తం 16 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపింది.
భారత నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్ర విశాఖపట్నం వేదికగా 2021లో వెలుగు చూసింది. ఏపీకి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టింది.