హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వికారాబాద్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ఇమ్మంది రామారావు దాఖలు చేసిన పిటిషన్పై ఎన్హెచ్ఆర్సీ బుధవారం విచారణ జరిపింది.
కేసులకు సంబంధించి వారంలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ను ఆదేశించింది. 28న హైదరాబాద్లో బహిరంగ విచారణ చేపడతామని స్పష్టంచేసింది. విచారణ జరిపే కార్యాలయ స్థలాన్ని తెలియచేస్తామన్న పేర్కొంది.