హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): కేంద్ర పర్యావరణ శాఖ ఈఏసీ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభు త్వం వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని, ఇప్పటివరకు పంపుహౌస్, అప్రోచ్ చాన ల్ పనులకు చేసిన భారీ తవ్వకాలను సత్వరమే పూడ్చివేయాలని సామాజిక కార్యకర్త, ఎన్జీటీ పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
పనులు చేపట్టిన ప్రాంతాన్ని పూర్వపుస్థితికి తేవాలన్న ఈఏసీ సిఫారసులను పాటించాలని కోరారు. లేదంటే ఈ విషయంలో ఫి ర్యాదు చేయాల్సి ఉం టుందని హెచ్చరించారు. ఏపీ సీఎస్ గా ఉండి ప్రాజెక్ట్ కట్టి, ఎన్జీటీతో చీ వాట్లు తిని, అకడ ప్రజాధనం వృథా చేసిన ఆదిత్యనాథ్దాస్ను తెలంగాణకు నీటిపారుదల సలహాదారుగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.