Sarpanch | రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం జరగాల్సి ఉంది.
కానీ ఆ రోజు అమావాస్య కావడం, పైగా సరైన ముమూర్తం లేకపోవడంతో ఆ డేట్ను ఈ నెల 22వ తేదీకి మార్చాలని పంచాయతీరాజ్ శాఖను ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన పంచాయతీరాజ్ శాఖ.. అపాయింట్ డేను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.