KCR | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సోమవారం నందినగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి ఎన్ఆర్ఐల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేశ్ బిగాల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదాత కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.