సూర్యాపేట : బీఆర్ఎస్లోకి(BRS) చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కోదాడ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనకు విసిగిపోయిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
కోదాడ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిదేశి లక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేడు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మల్లయ్య యాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.