చర్మ వ్యాధుల చికిత్సకు కొత్త ఔషధం
చర్మ సంబంధిత వ్యాధుల చికిత్స కోసం ఔషధాన్ని అభివృద్ధి చేసిన ఓ అధ్యాపకునికి కేంద్ర ప్రభుత్వం పేటెంట్ మంజూరుచేసింది.
- నిజాం కాలేజీ ప్రొఫెసర్‌కు పేటెంట్ మంజూరు
సుల్తాన్‌బజార్, మార్చి 21: చర్మ సంబంధిత వ్యాధుల చికిత్స కోసం ఔషధాన్ని అభివృద్ధి చేసిన ఓ అధ్యాపకునికి కేంద్ర ప్రభుత్వం పేటెంట్ మంజూరుచేసింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నిజాం కళాశాల మైక్రోబయాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ చాంద్‌పాషా.. యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియల్, కాస్మెటిక్ ఫార్ములేషన్‌కు సంబంధించిన ఔషధాన్ని రూపొందించారు. దీని ఉత్పత్తి ప్రక్రియకు పేటెంట్ కోసం ఆయన 2023 అక్టోబర్ 9న కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కేంద్రం ఆయనకు పేటెంట్ మంజూరు చేస్తూ 583659 నంబర్‌ను ఖరారుచేసింది. డాక్టర్ చాంద్‌పాషాకు ఇప్పటివరకు ఐదు పేటెంట్ హక్కులు లభించగా, మరో మూడు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ చాంద్‌పాషా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, మసలు(వార్ట్స్), హైపర్ పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్య లు రోజురోజుకూ అధికమవుతున్నాయ ని, వాటికి పరిమి త చికిత్సలే అందుబాటులో ఉన్నాయని అన్నారు. అవి కూడా అత్యం త ఖరీదైనవి, కనీ సం సంవత్సరంపాటు చికిత్స అవసరమైనవి ఉన్నాయని చెప్పారు. పైగా ఆ చికిత్సల వల్ల కొందరికి దుష్ప్రభావాలు కూడా కలుగుతున్నాయని తెలిపారు. తాను రూపొందించిన ఔషధం సున్నితమైన ఎక్సోఫిలియేషన్, యాంటిమైక్రోబియల్ క్రియాశీలత ఆధారంగా పనిచేస్తుందని వివరించారు. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, మసలు, హైపర్పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలకు సమ ర్థ్ధవంతమైన చికిత్సను సుమారు 90 శాతం తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అందించవచ్చని తెలిపారు. ఈ ఫార్ములేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఫార్మా పరిశ్రమల సహకారంతో త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

