హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): నదీ జలాల విషయంలో తమ వైఫల్యాలను కప్పిపుప్చుకొనేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి కొత్త నాటకానికి తెరలేపుతున్నది. ఇప్పుడు బనకచర్లపై చేసి న నయవంచన నుంచి ప్రజల దృష్టిని మ రల్చేందుకు ‘టెలిమెట్రీ’లను అడ్డం పెట్టుకుంటున్నది. అన్నిచోట్ల టెలిమెట్రీల ఏ ర్పాటుకు ఏపీని ఒప్పించామని, ఇది తమ విజయమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవానికి టెలిమెట్రీల ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైంది. మొదటిదశలో 18 చోట్ల వీటిని ఏర్పాటుచేశారు. రెండోదశలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 9 చోట్ల ఏర్పాటు చేయనున్నది. అంటే.. సగం ప ని కూడా చేయకుండా మొత్తం క్రెడిట్‌ను తానే కొట్టేసేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నదని నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు.
టెలిమెట్రీలను ట్యాంపర్ చేసిన ఏపీ
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి మొదటివిడతగా కేఆర్ఎంబీ నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ కలుపుకుని 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటుచేసింది. వాటిని ఏపీ ట్యాంపర్ చేసినట్టు అనుమానాలు ఉన్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీలే పనిచేయకుండా పోయాయి. ఇదేమని కేఆర్ఎంబీ అడిగితే పిచ్చుకలు వాటిని ధ్వంసం చేసినట్టు ఏపీ వెల్లడించింది. ఏపీ నే ట్యాంపరింగ్ చేసిందని కేఆర్‌ఎంబీతోపాటు, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభు త్వం ఫిర్యాదుచేసింది. దీంతో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి దానిపై కేఆర్ఎంబీ అధ్యయనం చేయించింది. టెలిమెట్రీల వ్యవస్థ ఏమాత్రం సవ్యంగా లేద ని ఆ కమిటీ స్పష్టంచేసింది. పోతిరెడ్డిపాడు దిగువన 600 మీటర్ల వద్ద ఏర్పా టు చేయాల్సిన టెలిమెట్రీలను, ఏకంగా 12.26 కిలోమీటర్ వద్దకు మార్చారని తేల్చింది. ఆ పాయింట్ సరికాదని, అక్కడ అమర్చిన నాన్ కాంటాక్ట్ రాడార్ వెలాసిటీ సెన్సర్ కూడా అంత అనువైనది కాదని స్పష్టం చేసింది. రెండో దశలో టెలిమెట్రీలను ఏర్పాటుచేసే సమయంలోనే పాత టెలిమెట్రీల ప్రాంతాన్ని, సెన్సర్లను మార్చాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.
సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే
నిరుడు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 1010పైగా టీఎంసీలు ఈ ఏడాది వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తున్నా తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తూ వచ్చింది. ప్రభుత్వ వైఫల్యం ఫలితంగా గత ఏడాది 76 శాతానికిపైగా జలాలను ఏపీ కొల్లగొట్టింది. ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, దిగువ సాగర్ కుడి కాలువ, పవర్ హౌజ్ స్లూయిస్ల ద్వారా 450కుపైగా టీఎంసీల జలాలను తన్నుకుపోయింది. తెలంగాణ మాత్రం తాత్కాలిక వాటా 34% కంటే తక్కువగా కేవలం 24% జలాలను మాత్రమే వినియోగించుకున్నది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిలదీయడంతో ఆ వైఫల్యాల ను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం టెలిమెట్రీలంటూ డ్రామాకు తెరలేపింది. అంతేకాదు.. ఏపీ సర్కారు నిధులివ్వకున్నా తామే మొత్తం భరిస్తామంటూ తెలంగాణ 8వ కేఆర్ఎంబీ బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు పెట్టింది.
టెలిమెట్రీల ఏర్పాటుకు రూ.7కోట్లను నిధులు అవసరమని బోర్డు చెప్పగా, రూ.4.15 కోట్లను విడుదల చేసింది. 5 నెలలు గడిచినా టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను బోర్డు చేపట్టలేదు. ఇలా అనేక అంశాలు న్నా ఢిల్లీలో భేటీలో ఒక్కదానిని కూడా పరిష్కరించకుండా సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. పైగా బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు అంగీకరించారు. ఈ వైఫల్యా న్ని కప్పిపుచ్చుకునేందుకు మరోసారి టెలిమెట్రీ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని నిపుణులు విమర్శిస్తున్నారు. నీటిని తరలించుకునే సామర్థ్యం, నిల్వచేసుకునే సామర్థ్యం ఉన్న నేపథ్యంలోనే ఏపీ సర్కా రు ఇష్టారీతిన కృష్ణాజలాలను కొల్లగొడుతున్నదని, ఆ అవకాశం లేకపోవడం వల్లే తెలంగాణ వాటాను వినియోగించుకోలేకపోతున్నదని గుర్తుచేస్తున్నారు. పాలమూ రు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేసి ఉంటే నీటితరలింపు, స్టోరేజీ సామర్థ్యం పెరిగి ఉండేదని గుర్తుచేస్తున్నారు. ప్రభు త్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా టెలీమెట్రీల ఏర్పాటు వెనక పరుగులు తీయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ఏర్పాటు చేయాల్సిన ఔట్లెట్లు
1) శ్రీశైలం కుడి ప్రధాన కాలువ 2) సాగర్ కుడి కాలువ 3) సాగర్ ఎడమ కాలువ 4) పాలేర్ రిజర్వాయర్ ఎగువన ఎడమ కాలువపై 136.35కిమీ వద్ద 5) సాగర్ ఎడమ కాలువ 101.36కిమీ ఏపీ బార్డర్ వద్ద 6) పోలవరం కెనాల్ 7) ప్రకాశం బరాజ్ పశ్చిమ కాలువ 8) ప్రకాశం బరాజ్ తూర్పూ ప్రధాన కాలువ 9) కర్నూలు కడప (కేసీ) కెనాల్
బీఆర్ఎస్ హయాంలో టెలిమెట్రీలుఏర్పాటు చేసిన పాయింట్లు
1) ఎమ్మార్పీ లిఫ్ట్ 2) సాగర్ డ్యామ్ డైవర్షన్ టన్నెల్ 3) ఎన్ఎస్పీ హెడ్‌రెగ్యులేటరీ 4) ఎన్ఎస్పీ లెఫ్ట్‌కెనాల్ టన్నెల్ 5) పాలేర్ రిజర్వాయర్ ఎగువన ఎంట్రీ వద్ద 6) పాలేర్ రిజర్వాయర్ దిగువన. 7) ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ 101.36కిమీ వద్ద 8) కల్వకుర్తి సిస్టర్న్ 9) శ్రీశైలం రిజర్వాయర్ 17/18బ్లాక్ 10) పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ 12.265కిమీ వద్ద 11) హెచ్ఎన్ఎస్ఎస్ పంప్‌హౌజ్ 12) జూరాల ప్రాజెక్టు 13) జూరాల రైట్ మెయిన్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ 14) జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ 15) జూరాల లెఫ్ట్ ప్యారలల్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ 16) భీమా లిఫ్ట్- 1 స్కీమ్ 17) నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్ 18) కోయిల్‌సాగర్ లిఫ్ట్ స్కీమ్.