హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఇటు నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు. కేసీఆర్‌ను అసభ్యంగా దూషి స్తూ వాడిన ఆ పదజాలానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును చేర్చి హ్యాష్‌ట్యాగ్ పేరిట వేలాది పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ‘ఎక్స్’లో #xxxRevanth హ్యాష్‌ట్యాగ్ గంటలోపే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘తీట మా టలు మానుకో’ రేవంత్ అంటూ ఓ నెటిజన్ దివంగత ఉద్యమ గాయకుడు సాయిచంద్ తిట్ల రూపంలో పాడిన పాటను పోస్టు చేశారు. భారతీయుడు అనే నెటిజన్ గతంలో కేసీఆర్ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలను వీడియోగా పోస్టు చేశారు. ‘తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ధర్మయుద్ధం ఉందని. ఇప్పటిలాగా లంగా యుద్ధం లేదు’ అని కేసీఆర్ చేసి న వ్యాఖ్యలను పోస్టు చేశారు. గణేశ్ అనే నెటిజన్ ‘అరేయ్ గుంపు మేస్త్రీ నిన్నేరా అనేది’ అం టూ కామెంట్ చేశాడు. ‘కేసీఆర్ గారు మీరు ఈ లుచ్చxxx గాడి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు’ అంటూ మరో నెటిజన్ కేసీఆర్ ఎన్నికల వేళ మాట్లాడిన ఓ వీడియోను పోస్టు చేశారు. ‘సరదా.. సరదాకే అసెంబ్లీని అంటుబెట్టేటోడు ఆయన.. నువ్వింక వైట్ పే పర్ అం టున్నవ్ సూస్కో మల్లా.. ఇజ్జత్ తీసుకోకు’ అం టూ మరో నెటిజన్ పోస్టు చేశారు. ‘ఇక నుంచి గుంపుమేస్త్రీ కాదు.. రండ రేవంత్’ అనేవి.. ‘ఇక కాస్కో xxx రేవంత్’ అంటూ పోస్టుల వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కోపోస్టుకు వం దల్లో లైకులు, వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.