Minister KTR | శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. అయితే దశాబ్దాలుగా నిరాదరణకు గురై.. రూపురేఖలు కోల్పోయిన వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే మెట్ల బావుల పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపట్టి.. ‘బావి’తరాలకు అందించేందుకు నడుం బిగించింది. ఇందులోభాగంగానే బల్దియా, హెచ్ఎండీఏ ప్రత్యేక చొరవతో బన్సీలాల్‌పేట మెట్ల బావి మళ్లీ జీవం పోసుకుంది. ఇది చూసిన వరంగల్‌కు చెందిన తోట మహేశ్ అనే ఓ నెటిజన్.. తమ దగ్గర కూడా అలాంటి పురాతనమైన మెట్ల బావి ఇటీవల బయటపడిందని.. కాకతీయుల కాలం నాటి ఆ మెట్ల బావికి పునరుజ్జీవం కల్పించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
నెటిజన్ రిక్వెస్ట్‌పై మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగాలను ఆదేశించారు.
Will take it up. @Collector_WGL please visit in person and work with @TSMAUDOnline to restore the step well https://t.co/Od78ybmkRN
— KTR (@KTRBRS) August 27, 2023