న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫేజ్ 5(ఏ) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా 16కి.మీ మేర 13 కొత్త స్టేషన్లను మూడేండ్ల వ్యవధిలో నిర్మిస్తారు. 13 స్టేషన్లను మూడు కారిడార్లుగా నిర్మిస్తారు. ఇందులో అతి పొడవైనది ఆర్కే ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ. రెండో కారిడార్ ఏరో సిటీ నుంచి ఐజీడీ ఎయిర్పోర్ట్, మూడోది తుగ్లక్బాద్ నుంచి కాళింది కుంజ్ మధ్య ఉంటుంది. ఆర్కే ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ సెక్షన్ల మధ్య విస్తరణ, ఇప్పటికే ఉన్న బొటానికల్ గార్డెన్-ఆశ్రమ్ మార్గ్ కారిడార్‌కు పొడిగింపు మార్గం అని తెలిసింది.